Realme Narzo 80 Pro 5G: వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర వెరీ చీప్- ఫీచర్స్ కిర్రాక్!

Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. 8/128GB ధర రూ.19,999, 8/256GB ధర రూ.21,499, 12/256 GB ధర రూ. 23,499గా ఉంది. తొలి సేల్‌లో రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. దీనిని అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

New Update
Realme Narzo 80 Pro 5G

Realme Narzo 80 Pro 5G

Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. ఇది MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో AMOLED డిస్‌ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం. 

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

Realme Narzo 80 Pro 5G Price

Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 నుండి ప్రారంభమవుతుంది. 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.21,499 కు లభిస్తుంది. 12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 23,499 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ నైట్రో ఆరెంజ్, రేసింగ్ గ్రీన్, స్పీడ్ సిల్వర్ కలర్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. 

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

Realme Narzo 80 Pro 5G Specifications

Realme Narzo 80 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కర్వ్‌డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఫోన్‌లో MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రియల్‌మే UI 6 స్కిన్‌తో నడుస్తుంది. Realme Narzo 80 Pro 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, 2 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సెల్ఫీ వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) అందించారు. అలాగే 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 65W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్ పొందింది. ఇది నీటిలో పడినా ఏం కాకుండా ఉంటుంది. 

Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు