/rtv/media/media_files/2025/06/07/RLTZW5aZrJfIQhQwLm0s.jpg)
oukitel wp55 pro launched
టెక్ బ్రాండ్ Oukitel మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ భారీ బ్యాటరీకి ప్రసిద్ధి చెందింది. తాజాగా కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ Oukitel WP55 Proను యూఎస్‌లో విడుదల చేసింది. ఇప్పుడు Oukitel WP55 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.
Oukitel WP55 Pro Price
Oukitel WP55 Pro స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. దీని ధర £329 (సుమారు రూ. 38,198)గా కంపెనీ నిర్ణయించింది. ఈ దృఢమైన ఫోన్ UKలోని ఈ-కామర్స్ సైట్ Amazonలో సేల్‌కి అందుబాటులో ఉంది .
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
Oukitel WP55 Pro Specifications
Oukitel WP55 Pro ఫోన్ 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ప్రత్యేక ఫీచర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అందించారు. ఇది 6nm ప్రాసెస్‌లో తయారు చేయబడింది. 16GB RAM, 512GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. స్టోరేజ్‌ని మైక్రో SD ద్వారా విస్తరించవచ్చు. అలాగే డైనమిక్ మెమరీ కేటాయింపు ద్వారా RAMని 48GB వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15లో నడుస్తుంది.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
కెమెరా సెటప్ విషయానికొస్తే.. WP55 Pro వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 11,000mAh బ్యాటరీని అందించారు.
ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Oukitel ప్రకారం.. బ్యాటరీ 77 గంటల టాక్ టైమ్, దాదాపు 1375 గంటల స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుందని తెలిపింది. WP55 Pro వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69K రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
best-smartphone | new-mobiles