/rtv/media/media_files/2025/08/11/nita-ambani-car-2025-08-11-16-50-32.jpg)
nita ambani car
అపర కుబేర, రిలయన్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) భార్య నీతా అంబానీ(Nita Ambani) మరోసారి వార్తల్లో నిలిచారు. అంబానీ కుటుంబంలో ఇప్పటికే ప్రపంచంలోని అరుదైన, ఖరీదైన కార్లు ఉండగా.. తాజాగా నీతా అంబానీ మరో లగ్జరీ కారును తమ గ్యారేజ్ లో యాడ్ చేశారు. దీని ధర అక్షరాల రూ. 100 కోట్లు! దీని పేరు 'ఆడి A9 ఛమేలియన్'. ఈ కారుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన లగ్జరీకార్లలో ఒకటని తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట. ఈ కారు అత్యాధునిక డిజైన్, అత్యున్నత సాంకేతికత మరియు అసాధారణమైన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
India’s richest ride belongs to #NitaAmbani the ₹100 crore @AudiIN A9 Chameleon! One of 11 #globally, this car stuns with a 600 HP V8 and #electronics paint that shifts colors on demand. #electriccarexperience#EVpic.twitter.com/EtqmxxBvmr
— Vikky as Hunter (@Vanama18V) August 11, 2025
Also Read : అతి పెద్ద మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు.. ఎవరూ చేరుకోలేని రహస్య భూమి!
'ఛమేలియన్' పెయింట్ వర్క్
అయితే ఈ కారుకు ఉన్న మరో ప్రత్యేకమైన ఫీచర్ దాని 'ఛమేలియన్' పెయింట్ వర్క్(Chameleon Paint Work). ఇది లైటింగ్, చూసే కోణాలను బట్టి రంగు మారుతుంది. దీని వల్ల కారు చూడడానికి ఎంతో అందంగా, విజువల్ వండర్ గా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ రంగులు మారడం వల్లే దీనికి ఈ మోడల్ కి 'చమేలియాన్' అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. కారు లోపల కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన ఫిట్టింగ్స్, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది బయటకు చూడడానికి 'కుర్చీనా' అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ లోపల ఎంతో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇప్పుడు నీతా అంబానీ కొనుగోలు చేసిన ఆడి A9 ఛమేలియన్ కారుతో పాటు అంబానీ కుటుంబంలో ఇప్పటికే ఉన్న అరుదైన, అత్యంత ఖరీదైన కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
- మెర్సిడెస్-బెంజ్ మేబాక్ S600 గార్డ్: ఈ కారు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, లగ్జరీ కార్లలో ఒకటి. దీని మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే.. ఇది బులెట్ ప్రూఫ్ అలాగే బాంబ్ ప్రూఫ్! దీని ధర దాదాపు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారును నీతా అంబానీ సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు.
- రోల్స్ రాయిస్ ఫాంటమ్: రోల్స్ రాయిస్ కార్లు అంటే అంబానీ కుటుంబానికి చాలా ఇష్టం. ఈ ఫాంటమ్ మోడల్ కారుపై 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ' అనే గోల్డ్ ఫిగర్ ఉంటుంది. దీనిని నీతా స్వయంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీంతో పాటు కారు హెడ్ రెస్ట్ పై "NMA" (నీతా ముఖేష్ అంబానీ) పేరును ఎంబ్రాయిడరీ చేయించినట్లు సమాచారం. ఈ కారు ధర దాదాపు ₹8.99 కోట్ల నుంచి ₹10.48 కోట్లు వరకు ఉంటుంది.
- రోల్స్ రాయిస్ కల్లినన్ ఈ కారును ముఖేష్ అంబానీ గతేడాది నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ కారు పెయింటింగ్ కోసమే దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. దీని ధర సుమారు ₹10 కోట్లు వరకు ఉంటుంది. వీటితో పాటు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ 760Li సెక్యూరిటీ మోడల్ కార్స్ ఉన్నాయి.
Also Read: రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!