Windracers Ultra Drone: అతి పెద్ద మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు.. ఎవరూ చేరుకోలేని రహస్య భూమి!

బ్రిటన్‌లో తయారైన విండ్రేసర్స్ అల్ట్రా డ్రోన్, మానవులు వెళ్లలేని వెస్ట్ అంటార్క్టికాలోకి ప్రవేశించి, తొలిసారి అక్కడి భూభాగాన్ని మ్యాప్ చేసింది. ఇది శాస్త్రవేత్తలకు కొత్త భూ సమాచారాన్ని అందించి, భూ చరిత్రపై కొత్త విశ్లేషణలకు దారితీసింది.

New Update
Windracers Ultra Drone

Windracers Ultra Drone

Windracers Ultra Drone: అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనలకు మరో కీలక ముందడుగు పడింది. బ్రిటన్‌లో తయారైన ఒక స్వయం నియంత్రిత భారీ డ్రోన్, "విండ్రేసర్స్ అల్ట్రా" (Windracers ULTRA), తాజాగా మనుషులు చేరలేని అంచుల్లో ఉన్న వెస్ట్ అంటార్క్టికాలోకి(Windracers Ultra Drone Antarctica) ప్రవేశించి, అక్కడి భూభాగాన్ని మొదటిసారి దగ్గర నుంచి మ్యాప్ చేసింది. మానవులు వెళ్లలేని, అత్యంత శీతలమైన, ప్రతికూల వాతావరణంలో ఉన్న ఈ ప్రాంతం గురించి ఇప్పటివరకు కేవలం ఊహల మీదే ఆధారపడ్డ శాస్త్రవేత్తలకు ఇప్పుడు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

ఈ ప్రత్యేక డ్రోన్ మిషన్‌ను(Flying Drone) బ్రిటిష్ అంటార్కటిక్ సర్వే నిర్వహించింది. ULTRA అనేది భారీ బరువులు మోయగల సామర్థ్యం ఉన్న డ్రోన్. ఇది 600 మైళ్ళ దూరం వరకూ ఎలాంటి మానవ సహాయం లేకుండా స్వయంగా ప్రయాణించగలదు. దాదాపు 300 పౌండ్ల (సుమారు 136 కిలోల) వరకు పరికరాలు మోయగల ఈ యంత్రం, మంచుతో నిండిన మైదానాల మీద సులభంగా ల్యాండ్ అవుతుంది.

Also Read: Chatgpt ఎంత పని చేసింది భయ్యా.. దెబ్బకు మైండ్ బ్లాంక్..!

భూమి చరిత్రపై కొత్త కోణం..

ఈ డ్రోన్ తీసుకొచ్చిన ఫొటోలు, భౌగోళిక డేటా శాస్త్రవేత్తలకి భూ మండల నిర్మాణం, భూకంపాలు, భూమి చరిత్రపై కొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. లక్షల సంవత్సరాలుగా ఈ ప్రాంత భూ నిర్మాణం ఎలా ఏర్పడిందన్న విషయంపై కొత్త సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనలు భూగోళ విజ్ఞాన శాస్త్రంలో కొత్త అధ్యనం అని చెప్పవచ్చు.

ULTRA మిషన్‌ విజయానికి ప్రధాన కారణం, ఇది వాతావరణ పరిస్థితులకు భయపడదు. మంచు, బలమైన గాలులు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఏవి దీని పనిని ఆపలేవు. విండ్రేసర్స్ మిషన్ కంట్రోల్ ద్వారా దీనిని ముందే ప్రోగ్రామ్ చేశారు. మిడ్ ఎయిర్‌లో ఏదైనా మార్పులు చేయాల్సిన సందర్భాల్లో, కేవలం దాని పాత్ చేంజ్ చేయడం మాత్రమే మానవ ప్రమేయంతో జరుగుతుంది. మిగతా అంతా దానంతట అదే చేయగలదు.

Also Read:ప్రతీది ChatGPTని అడిగేస్తున్నారా..? జాగ్రత్త మీ సంభాషణలు అందరూ చూసేస్తున్నారు..!

ఈ మిషన్ నిరూపించిన విషయం ఏమిటంటే, డ్రోన్‌ల ద్వారా మనం ఇప్పటివరకు చేరలేని ప్రదేశాలను ఇప్పుడు చేరుకోగలుగుతున్నాం. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ విధమైన ప్రాజెక్టులు భవిష్యత్తులో మరిన్ని కొత్త అన్వేషణలకు దారితీయబోతున్నాయి.

నీటిలో ఈదే, గాల్లో ఎగిరే హైబ్రిడ్ డ్రోన్‌లు, ఎడారి వేడి భరించే ఎయిర్ టాక్సీలు - ఇవి అన్నీ భవిష్యత్ విమానసాంకేతికతను కొత్త దిశగా మలచనున్నాయి.

మొత్తానికి, ULTRA మిషన్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది.. మానవులు వెళ్లలేని ప్రదేశాలలో ఇప్పుడు యాంత్రిక మేధస్సు అడుగుపెడుతోంది. శాస్త్రం, సాంకేతికత కలిసి మన భవిష్యత్తును తిరిగి వ్రాస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు