/rtv/media/media_files/2025/06/01/C4xlpvzUAvefxVq9WSU2.jpg)
Motorola Edge 2025 Price
ప్రముఖ టెక్ బ్రాండ్ మోటో ఇటీవల తన లైనప్‌లో ఉన్న Motorola Edge 2025 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో హైక్లాస్ ఫీచర్లు అందించింది. డిస్‌ప్లే, బ్యాటరీ ప్యాక్, ఆండ్రాయిడ్ సిస్టమ్, ప్రాసెసర్, కెమెరా, ఏఐ ఫీచర్స్‌ను కొత్త ఫోన్‌లో అందించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అయితే ముందుగా కంపెనీ ఈ ఫోన్‌ను అమెరికాలో లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..
Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
Motorola Edge 2025 Price
Motorola Edge 2025 స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజ్ అయింది. దీని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,000గా కంపెనీ నిర్ణయించింది. మొదటి సేల్‌లో భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలుపుకుంటే ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది జూన్ 5 నుండి USలో మోటరోలా వెబ్‌సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో
Motorola Edge 2025 Specifications
మోటోరోలా ఎడ్జ్ 2025 ఆండ్రాయిడ్ 15 పై హలో UI తో నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల సూపర్ HD pOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoCతో అమర్చబడింది. మోటరోలా ఎడ్జ్ 2025లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.
Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో కొత్త AI కీ కూడా ఉంది. ఈ కీని నొక్కడం ద్వారా వినియోగదారులు నెక్స్ట్ మూవ్, క్యాచ్ మీ అప్, పే అటెన్షన్, రిమెంబర్ దిస్ వంటి మోటో AI ఫీచర్లు, ప్రాంప్ట్‌లకి యాక్సెస్ పొందుతారు. అందులో నెక్స్ట్ మూవ్ యూజర్ స్క్రీన్ పై ఏముందో గుర్తిస్తుంది. క్యాచ్ మీ అప్ ఫీచర్.. బ్లాక్ అయిన నోటిఫికేషన్‌లను కనుగొంటుంది.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
పే అటెన్షన్ ఫంక్షనాలిటీ.. వాయిస్ లేదా సమావేశాలను రికార్డ్ చేస్తుంది. రిమెంబర్ ఫీచర్.. ఫోటోలు లేదా అలర్ట్‌ల నుండి సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. తరువాత ప్రాంప్ట్ చేసినప్పుడు కీలక వివరాలు, వాస్తవాలను గుర్తుచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, గ్లోనాస్, గెలీలియో, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 68W టర్బోపవర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది.
tech-news | telugu tech news