/rtv/media/media_files/2025/10/15/iqoo-z10r-5g-2025-10-15-17-43-05.jpg)
iQOO Z10R 5G
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ, వివో సబ్-బ్రాండ్ ఐక్యూ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్ లో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గురింపు సంపాదించుకుంది. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో న్యూ మోడల్స్ అందించి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10R 5Gని తాజాగా రష్యాలో విడుదల చేసింది. కంపెనీ ఇటీవల భారతదేశంలో అదే పేరుతో ఒక మోడల్‌ను విడుదల చేసింది. అయితే రెండు ఫోన్లు డిజైన్, ప్రాసెసర్, బ్యాటరీ, స్టోరేజ్ లో భిన్నంగా ఉంటాయి. ఈ రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15పై నడుస్తాయి. iQOO Z10R 5G మొబైల్ 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. అయితే భారత్ లో విడుదలైన ఈ మొబైల్ వేరియంట్ కొంచెం సన్నగా, తేలికగా ఉంటుంది. ఇప్పుడు రష్యన్ వేరియంట్ ధర, స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
iQOO Z10R 5G
price
రష్యాలో విడుదలైన iQOO Z10R 5G ధర విషయానికొస్తే.. ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 26,000 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 31,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. iQOO Z10R 5G యాండెక్స్ వంటి దేశంలోని ప్రధాన ఇ-కామర్స్ సైట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
iQOO Z10R 5G specs
iQOO Z10R 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. రష్యన్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. iQOO Z10R 5G ఫోన్ Android 15-ఆధారిత Funtouch OS 15పై నడుస్తుంది. ఇది తరువాత OriginOS 6 అప్‌డేట్‌ను అందుకుంటుంది. కొత్త iQOO ఫోన్ MediaTek Dimensity 7360-Turbo (4nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది.
ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. iQOO Z10R 5G మొబైల్ లో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ ఉంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 6,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. iQOO Z10R 5G ఫోన్ IP65-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. iQOO Z10R 5G భారతదేశంలో జూలై 24న ప్రారంభించబడింది. దీని బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499గా ఉంది. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో కూడా వస్తుంది.