/rtv/media/media_files/2025/10/08/jio-cheapest-recharge-plan-2025-10-08-07-46-57.jpg)
Jio Cheapest Recharge Plan
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం తరచూ కొత్త కొత్త ప్లాన్‌లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాల్టీ షోలు, లైవ్ స్పోర్ట్స్ చూసే వారికోసం జియో హాట్‌స్టార్‌తో సహా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్ కూడా అందిస్తుంది. ఇప్పుడు జియో అతి తక్కువ ధరలో హాట్‌స్టార్ సహా ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.
జియో రూ. 355 ప్లాన్
రూ.355లతో రీఛార్జ్ చేసుకుంటే.. డేటా, కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్, 30 రోజుల పాటు 25GB డేటా, రోజుకు 100 SMSలు పంపుకునే సౌకర్యం, JioTV, JioAICloud (50GB స్టోరేజ్) కు యాక్సెస్, జియోహోమ్‌కి సంబంధించి 2 నెలల ఉచిత ట్రయల్, అర్హత కలిగిన వినియోగదారులకు Google Gemini Pro కి 18 నెలల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అందువల్ల మీరు మీ ఫోన్‌లో క్రికెట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడాలనుకుంటే ఇది సరైన ప్లాన్.
జియో రూ. 799 ప్లాన్
ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోకూడదనుకునే వారికి.. జియో రూ.799 ప్లాన్ ఒక మంచి ఆప్షన్. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇందులో జియోహాట్‌స్టార్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌లకు యాక్సెస్ కూడా ఉంటుంది. అందువల్ల ఎక్కువ కాలం డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ రెండింటినీ ఆస్వాదించాలనుకుంటే ఈ ప్లాన్ బెటర్.
Follow Us