Maruti Suzuki Recall: బిగ్ షాక్.. 39,506 కార్లలో సమస్యలు - కంపెనీ సంచలన ప్రకటన

మారుతి సుజుకి తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా మోడల్‌ను రీకాల్ చేసింది. డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన ఈ మోడల్‌లో దాదాపు వేల యూనిట్లను రీకాల్ చేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

New Update
Maruti Suzuki Recall (1)

Maruti Suzuki Grand Vitara Recall

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా మోడల్‌ను రీకాల్ చేసింది.  డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన ఈ మోడల్‌లో దాదాపు వేల యూనిట్లను రీకాల్ చేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 

Maruti Suzuki Recall

దీనిపై మారుతి సుజుకి కంపెనీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘‘కస్టమర్లు ఎలాంటి సమస్యలు, ప్రమాదాలను ఎదుర్కోకుండా.. వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల మొత్తం 39,506.. SUV గ్రాండ్ విటారా వాహనాల తనిఖీ కోసం రీకాల్ చేయడం జరిగింది.’’ అని తెలిపింది. అదే సమయంలో SUV గ్రాండ్ విటారాలోని సమస్యలను వెల్లడించింది. కొన్ని మోడళ్లలో స్పీడోమీటర్ అసెంబ్లీలో ఉన్న ఇంధన స్థాయి సూచిక, అలర్ట్ లైట్ ఇంధన స్థాయి సమాచారాన్ని సరిగ్గా ప్రదర్శించడం లేదనే అనుమానాలు వ్యక్తం చేసింది. 

ఇంధన స్థాయి రీడింగ్‌లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సమస్యలను కలిగిస్తాయని.. అందువల్లనే మారుతి సుజుకి ఈ చెకింగ్ ప్రచారాన్ని ప్రారంభించిందని తెలిపింది. ఇప్పటికే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న కస్టమర్లలను సమీప డీలర్‌షిప్‌లు నేరుగా సంప్రదించి.. వారి వాహనాలను చెక్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. చెకింగ్ సమయంలో ఏవైనా లోపాలు కనుగొనబడితే కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుందని.. దీని కోసం కస్టమర్ల నుండి ఎలాంటి ఛార్జీలు విధించదని తెలిపింది.  

ఈ దశ పూర్తిగా రోడ్డు భద్రత, కస్టమర్ రక్షణ కోసమేనని మారుతి సుజుకి పేర్కొంది. కాగా కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఎప్పటికప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 2022లో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్‌లో సమస్య కారణంగా కంపెనీ సుమారు 17,362 వాహనాలను రీకాల్ చేయగా.. ఇప్పుడు ఇంధన స్థాయి రీడింగ్‌లో సమస్యలు ఉన్నాయనే అనుమానంతో దాదాపు 39వేలకు పైగా వాహనాలను రీకాల్‌ చేసింది.

Advertisment
తాజా కథనాలు