/rtv/media/media_files/2025/07/06/iqoo-13-ace-green-special-edition-launching-at-july-12th-2025-07-06-17-45-18.jpg)
iqoo 13 ace green special edition Launching at july 12th
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO త్వరలో iQOO 13 సిరీస్‌లో కొత్త కలర్‌లో స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేయబోతుంది. Ace Green కలర్‌తో iQOO 13 కొత్త వేరియంట్ వచ్చే వారం లాంచ్ అవుతుంది.
iQOO 13 ace green special edition
తాజాగా కంపెనీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. జూలై 12న భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని iQOO తెలిపింది. ఇది ఈ-కామర్స్ సైట్ అమెజాన్, దేశంలోని కంపెనీ ఈ-స్టోర్ ద్వారా సేల్‌కు అందుబాటులో ఉంటుంది. iQOO 13 రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999, 16 GB + 512 GB వేరియంట్ ధర ధర రూ. 59,999గా ఉంటుంది. దీనిపై రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Capture brilliance in every frame.
— iQOO India (@IqooInd) July 6, 2025
With the Sony IMX921 VCS True Color Camera, the #iQOO13 delivers lifelike tones and flagship-level clarity—even in challenging lighting. 📸
Every detail. Every color. Just as it should be.
Goes live 12th July! Only on @amazonIN &… pic.twitter.com/GmnkkiRYEo
iQOO 13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అందించారు. 120 W ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీ అందించారు. దీనికి పెద్ద కూలింగ్ సిస్టమ్ ఉంది.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
iQOO Z10 Lite
ఇదిలా ఉంటే ఇటీవల iQOO Z10 లైట్ 5G భారతదేశంలో సేల్‌కు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్‌లో లాంచ్ అయింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 GB + 128 GB రూ.10,999, 8 GB + 256 GB వేరియంట్ రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది.