/rtv/media/media_files/2025/09/25/iphone-16-price-cut-2025-09-25-15-05-39.jpg)
iphone 16 price cut
Iphone వాడాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా కొందరు తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు, డిస్కౌంట్‌లు ఉంటే.. అప్పుడు కొనుక్కోవచ్చని అనుకుంటుంటారు. అలాంటి వారికి అదిరిపోయే సర్‌ప్రైజ్. మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. అమెజాన్‌లో Iphone 16 పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఎక్కువ కాలం ఉండదు.
అందువల్ల భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలో Iphone 16ను కొనుక్కోవచ్చు. దీనిపై దాదాపు రూ.17000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గతంలో కంటే మరింత తక్కువ ధరకు లభిస్తుంది. ఇప్పుడు Iphone 16 ధర, ఆఫర్లు, డిస్కౌంట్లు, స్పెషిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Iphone 16 Price Drop
అమెజాన్‌లో Iphone 16పై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల విషయానికొస్తే.. ఈ మొబైల్ భారతదేశంలో రూ.79,900లకి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ.66,990లకే అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు రూ.12,910 ఫ్లాట్ తగ్గింపు లభించిందన్నమాట. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ట్రాన్షక్షన్స్ చేస్తే.. అదనంగా రూ.4,250 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత Iphone 16 రూ.62,740కి కొనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. పాత లేదా ఇప్పటికే వాడుతున్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా Iphone 16ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా దీనిపై రూ.17000లకు పైగా తగ్గింపు పొందవచ్చు.
Iphone 16 Specs
Iphone 16 మొబైల్ 6.1 -అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, HDR, ట్రూ టోన్ మద్దతుతో సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. Iphone 16లో కొత్త ఆపిల్ A18 చిప్‌సెట్ ప్రాసెసర్ అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP ఫ్యూజన్ సెన్సార్, 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం HDR వీడియో, పోర్ట్రెయిట్ సపోర్ట్‌తో 12MP ఫ్రంట్ కెమెరా అందించారు. Iphone 16లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఇది 22 గంటల ప్లేబ్యాక్ టైంతో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.