Instagram: ఇన్‌స్టాగ్రామ్ రహస్యంగా యూజర్ల మాటలు వింటుందా..! నిజం చెప్పిన CEO

మొబైల్ పక్కన పెట్టి మీరు ఫ్రెండ్‌తో ఓ కొత్త షూ గురించి మాట్లాడితే. కొన్ని నిమిషాలకే అదే షూ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ కనిపించింది. అంటే ఇన్‌స్టాగ్రామ్ మీ మాటలు అన్నీ రహస్యంగా వింటున్నట్లే కదా? ఈ అనుమానం దాదాపు ప్రతి ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కు ఉండేదే.

New Update
Adam Mosseri

మొబైల్ పక్కన పెట్టి మీరు ఫ్రెండ్‌తో ఓ కొత్త షూ గురించి మాట్లాడితే. కొన్ని నిమిషాలకే అదే షూ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ కనిపించింది. అంటే ఇన్‌స్టాగ్రామ్ మీ మాటలు అన్నీ రహస్యంగా వింటున్నట్లే కదా? ఈ అనుమానం దాదాపు ప్రతి ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కు ఉండేదే. చాలామంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఎన్నో ఎళ్లుగా ఈ డౌట్ ఉంటుంది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ అధినేత ఆడమ్ మొస్సెరి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల వ్యక్తిగత సంభాషణ వింటుందనేది కేవలం ఓ అపోహ మాత్రమే అని ఆయన కొట్టిపారేశారు.

ఆడమ్ మొస్సెరి మాట్లాడుతూ ఓ వీడియో మెస్సేజ్ పంపాడు. ఇన్‌స్టాగ్రామ్ సీక్రెట్‌గా యూజర్ల మాటలు వినదని ఆయన చెప్పారు. అలాగే యాడ్స్ టార్గెట్ చేసుకోవడానికి యూజర్ల మొబైల్ మైక్రోఫోన్‌ ఉపయోగించమని తేల్చి చెప్పారు.

Also Read :  ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. జెర్రుంటే ఊపరితిత్తులు పగిలిపోయేవి!

Adam Mosseri Clears About Instagram Conversations

రెండు కారణాలు
బ్యాటరీ సమస్య: వినియోగదారుల సంభాషణలను నిరంతరం రికార్డ్ చేయడం వలన వారి ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఇంత పెద్ద మొత్తంలో డేటాను స్టోర్ చేయడం, అనాలసిస్ చేయడం అనేది లాజిస్టికల్‌గా, సాంకేతికంగా అసాధ్యం. అంతేకాకుండా, మైక్రోఫోన్ ఆన్‌లో ఉంటే, ఫోన్‌లో మైక్రోఫోన్ ఇండికేటర్ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.

అల్గారిథమ్ అద్భుతం: యూజర్లు మాట్లాడుకున్న దాని గురించే యాడ్స్ రావడానికి ప్రదాన కారణం కంపెనీ లెటెస్ట్ అల్గారిథమ్ అని మొస్సెరి వివరించారు. ఉదాహరణకు, మీరు ఆన్‌లైన్‌లో ఓ ప్రాడక్ట్ కోసం వెతకడం, దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూడటం లేదా మీ ఫ్రెండ్స్ ఆ వస్తువు గురించి చర్చించడం వంటి వాటి ఆధారంగా మీకు యాడ్స్ కనిపిస్తాయి. 

మొస్సెరి వివరణ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ మీ సంభాషణలను వినకపోయినా, మీ ఆన్‌లైన్ యాక్టివిటీ, ఇతరుల ఇష్టాఇష్టాలను బట్టి మీ ఆసక్తులను కచ్చితంగా అంచనా వేయగలదు. అందుకే యాడ్స్ చాలా కచ్చితంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తాయని తెలిపారు.

Also Read :  విండోస్ 10 వాడుతున్నారా..అయితే వెంటనే 11కు అప్డేట్ అవ్వండి..ఇంకొన్ని రోజులే గడువు..

Advertisment
తాజా కథనాలు