/rtv/media/media_files/2025/10/03/techie-survives-scuba-diving-2025-10-03-11-35-20.jpg)
టెక్నాలజీ కేవలం వినోదం కోసమే కాదు, ప్రాణాలను కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. ఇటీవల స్కూబా డైవింగ్ ప్రమాదంలో చిక్కుకున్న ముంబైకి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్ క్షితిజ్ జోడాపేని ఆపిల్ వాచ్ కాపాడింది. కొన్ని నెలల క్రితం, క్షితిజ్ జోడాపే పుదుచ్చేరి తీరంలో 36 మీటర్ల లోతులో సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. డైవ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా అతని బెయిట్ బెల్ట్ ఊడిపోయింది. స్కూబా డైవర్ నీళ్లలో నిలకడగా ఉండటానికి ఈ బెల్ట్ చాలా ముఖ్యం. ఆ బెల్ట్ తెగిపోవడంతో క్షితిజ్ స్పీడ్‌గా పైకి తేలిపోతున్నాడు. ఇంత వేగంగా ఉపరితలంపైకి రావడం చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే శరీరంలోని నైట్రోజన్ వాయువులు త్వరగా విస్తరించి ఊపిరితిత్తులు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని 'డీకంప్రెషన్ సిక్‌నెస్' లేదా 'ది బెండ్స్' అని కూడా అంటారు.
Mumbai diver’s Apple Watch Ultra turns hero!#Applehttps://t.co/tU0bHvLWarpic.twitter.com/LqXc0uPrqu
— Mashable India (@MashableIndia) October 3, 2025
క్షితిజ్ వేగంగా పైకి వెళ్తున్నప్పుడు, అతని చేతికి ఉన్న ఆపిల్ వాచ్ అల్ట్రా స్పందించింది. అది డైవ్ డెప్త్‌ను కొలిచే సామర్థ్యం కలిగి ఉండటంతో గుర్తించి వెంటనే అత్యవసర హెచ్చరికలను పంపింది. క్షితిజ్ ఆ అలర్ట్ మెస్సేజ్ పట్టించుకోకపోవడంతో, యాపిల్ వాచ్ సైరన్‌ని కూడా మోగించింది. ఈ సైరన్ నీటిలో కూడా స్పష్టంగా వినిపించడంతో, క్షితిజ్‌కి కాస్త ముందు ఉన్న అతని డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఇన్‌స్ట్రక్టర్ వెనక్కి ఈది క్షితిజ్‌ని కంట్రోల్ చేసి.. నెమ్మదిగా పైకి తీసుకొచ్చాడు. వాచ్ సైరన్ లేకపోతే, అప్పటికే చాలా లోతుకు వెళ్లిపోయిన ఇన్‌స్ట్రక్టర్‌కు ఈ ప్రమాదం గురించి తెలిసి ఉండేది కాదు. వాచ్‌లో ఆ సైరన్ ఫీచర్ ఉందని నాకు కూడా తెలియదని క్షితిజ్ షాక్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత, క్షితిజ్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ఈ అనుభవాన్ని వివరిస్తూ లేఖ రాశాడు. టిమ్ కుక్ స్పందిస్తూ.. మీ ఇన్‌స్ట్రక్టర్ అలారం విని సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని టిమ్ కుక్ అన్నారు.