Micro Soft: విండోస్ 10 వాడుతున్నారా..అయితే వెంటనే 11కు అప్డేట్ అవ్వండి..ఇంకొన్ని రోజులే గడువు..

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మరి కొన్ని రోజుల్లో ఎండ్ అవబోతోంది. అక్టోబర్ 14 నుంచి ది అందుబాులో ఉండదు. అందుకే దీనిని వాడుతున్న వాళ్ళు అందరూ విండోస్ 11కు అప్డేట్ అవ్వాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.

New Update
windows 10

 మీరు విండోస్ 10 వాడుతున్నారా...అయితే వెంటనే విండోప్ 11 కు అప్డేట్ అవ్వండి..లేకపోతే ఇబ్బందులు తప్పవు అని చెబుతోంది మైక్రోసాఫ్ట్. ఎందుకంటే విండోస్ 10 ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని తెలిపింది. 2025 అక్టోబర్‌ 14 నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్‌  ఉండవని చెబుతోంది. ఇప్పటికీ  విండోస్ 10 వాడుతున్నట్టు అయితే కుక వెంటనే 11 కు అప్డేట్ అవ్వని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. 

వెంటనే అప్డేట్ అవ్వండి..

విండోస్ 10 సపోర్ట్ ను నిలిపివేస్తున్నామని మైక్రోసాఫ్ట్ రెండేళ్ళ క్రితమే అనౌన్స్ చేసింది. ఈ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విండోస్ 10 నుంచి 11 కు ఎలా అప్డేట్ అవ్వాలో మైక్రోసాప్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూసఫ్‌ మెహ్దీ తన బ్లాగ్ లో రాశారు. అయితే విండోస్ 10కు మైక్రోసాఫ్ట్ నిలిపేసినా.. ఎప్పటిలానే ఓఎస్ పని చేస్తుందని తెలిపారు. కానీ సెక్యూరిట అప్డేట్స్ మాత్రం రావు. దీని వలన భద్రతాపరైన రిస్కులు, మాల్ వేర్, కంపాబిలిటీ వంటి సమస్యలు వస్తే..సొల్యూషన్స్ ఇవ్వలేమని చెప్పారు. ముఖ్యంగా ఆన్ లైన్ బ్రౌజింగ్ చేసే వారికి రిస్క్ ఉంటుందని చెప్పారు. 

విండోస్ 10లో ఇంటెలిజెన్స్ సపోర్ట్ మాత్రం 2028 వరకు కొనసాగనుంది. ఇది ప్రాథమిక స్థాయి సెక్యూరిటీని మాత్రమే అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలాగే, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పోలిస్తే యాంటీ వైరస్‌లు ఇచ్చే భద్రత అంతంత మాత్రమేనని చెప్పింది. ఒకవేళ పూర్తి స్థాయిలో భద్రత కోరుకునేవారైతే ఎక్సటెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 2025 అక్టోబర్‌ 15 నుంచి డివైజ్‌ సెట్టింగ్స్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం లక్షల మంది విండోస్ 10ను ఉపయోగిస్తున్నారు. వారందరూ విండోస్ 11కు అప్డేట్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. విండోస్ 10 కోసం ఎక్స్ టెండెడ్ ప్రోగ్రామ్ తీసుకున్నా..కేవలం సెక్యూరిటీ అప్డూట్స్ మాత్రమే వస్తాయని..కొత్త ఫీచర్లు గానీ, డిజైన్‌ మార్పిడి రిక్వెస్టులు గానీ, నాన్‌ సెక్యూరిటీ రిక్వెస్టులు గానీ ఇవ్వలేమని మైక్రోసాఫ్ట్ తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు