/rtv/media/media_files/2025/04/17/KGRitpAIVWhDOFQ3yaXI.jpg)
Honor 400 and 400 Pro smartphones
Honor 400 and Honor 400 Pro: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ తన లైనప్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. హానర్ 400 లైట్ గతంలో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో హానర్ 400, హానర్ 400 ప్రో పేర్లతో త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్లు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honor 400 Specifications
హానర్ 400 ఫోన్లో డైనమిక్ డిమ్మింగ్, AI సిర్కాడియన్ నైట్ డిస్ప్లే, AI డీఫోకస్ ఐకేర్, అల్ట్రా డార్క్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్తో రానున్నట్లు తెలిసింది. ఇది 5,300mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రావచ్చు. 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్లో 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే సెల్ఫీల కోసం ఫోన్లో 50MP ఫ్రంట్ కెమెరా అమర్చబడి ఉండవచ్చు.
ఇది కూడా చూడండి: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
అలాగే హానర్ 400 ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావచ్చు. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి. దీనిలో కంపెనీ IP65 రేటింగ్ ఇస్తుంది. ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
Honor 400 Pro Specifications
హానర్ 400 ప్రో ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్తో అమర్చబడుతుంది. ఫోన్లో 200MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది కూడా చూడండి: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
దీనికి OIS మద్దతు కూడా ఉంటుంది. దీనితో పాటు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్ కెమెరాతో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఈ Honor 400 Pro ఫోన్లో 5300mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
tech-news | telugu tech news | tech-news-telugu