Flipkart SASA LELE Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. అదిరే డిస్కౌంట్లతో కిక్కే కిక్కు!

ఫ్లిప్‌కార్ట్‌ సాసా లీలీ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 9ఏ, మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G, ఐక్యూ 12 5G, వన్‌ప్లస్ 12, శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్లను అదిరిపోయే తగ్గింపులతో సొంతం చేసుకోవచ్చు.

New Update
Flipkart SASA LELE Sale

Flipkart SASA LELE Sale

ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో కస్టమర్ల కోసం Flipkart SASA LELE Saleను ప్రారంభించింది. ఈ సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ల ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. 

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

Google Pixel 9a

Google Pixel 9a ఫోన్‌లో 8GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ.1250 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.48,749కి లభిస్తుంది. అదే సమయంలో పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.28,200 ఆదా చేయవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే లభిస్తుంది. 

Motorola Edge 50 Ultra 5G

Motorola Edge 50 Ultra 5G ఫోన్ 12GB RAM / 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 49,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్‌లో అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల చెల్లింపుపై రూ. 5,000 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ. 44,999కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 31,200 ఆదా చేయవచ్చు.

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

iQOO 12 5G

iQOO 12 5G ఫోన్ 12GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 47,555 ధరకు లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తగ్గింపు (రూ. 1250 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.46,305కి లభిస్తుంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. 

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

OnePlus 12

OnePlus 12 ఫోన్ 12GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 51,486 కు లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ. 1250 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ. 50,236లకి లభిస్తుంది. ఈ ఫోన్ 6.82 అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. దీనికి 5400mAh బ్యాటరీ ఉంది. 

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

Samsung Galaxy S24 5G

Samsung Galaxy S24 5G ఫోన్ 8GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 44,999 కు లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.27,500 ఆదా చేసుకోవచ్చు. 

tech-news | tech-news-telugu | telugu tech news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు