Aadhaar Through WhatsApp: ఈ నంబర్‌తో వాట్సాప్‌‌లోనే ఇక ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోడానికి ఇప్పుడు నెట్ సెంటర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం మైగవ్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

New Update
Aadhaar through WhatsApp

ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోడానికి ఇప్పుడు నెట్ సెంటర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు(Aadhaar Through WhatsApp) ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం మైగవ్ హెల్ప్‌డెస్క్ ద్వారా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనాఆధార్ కార్డును కేవలం కొన్ని క్షణాల్లోనే పొందవచ్చు. ఇది డిజిలాకర్ సేవలతో అనుసంధానించబడి ఉంటుంది.

వాట్సాప్‌లోఆధార్(aadhar-card) డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అలాగే, డిజిలాకర్ అకౌంట్ కూడా ఉండాలి. ఒకవేళ డిజిలాకర్ అకౌంట్ లేకపోతే, వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండు నిబంధనలు పాటించిన తర్వాతనే మీరు వాట్సాప్ ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.

Also Read :  ఐఫోన్, శాంసంగ్, స్మార్ట్‌టీవీలు, పవర్ బ్యాంక్‌లపై భారీ డిస్కౌంట్లు..!

ఆధార్ డౌన్‌లోడింగ్‌కు ఈ స్టెప్స్ ఫాలోఅవ్వండి:

ముందుగా, మీ ఫోన్‌లో మైగవ్ హెల్ప్‌డెస్క్ అధికారిక నంబర్ +91-9013151515 ను సేవ్ చేసుకోండి.

ఆ తర్వాత, మీ వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు సేవ్ చేసుకున్న నంబర్‌కు 'హాయ్' లేదా 'నమస్తే' అని మెసేజ్ పంపండి.

చాట్‌బాట్ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో 'డిజిలాకర్ సర్వీసెస్' ఎంచుకోండి.

ఇప్పుడు, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

ఓటీపీ ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ డిజిలాకర్ ఖాతాలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల జాబితా కనిపిస్తుంది.

అందులోంచి 'ఆధార్'ను ఎంచుకోండి. వెంటనే మీ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో మీ వాట్సాప్‌కు వస్తుంది.

ఈ కొత్త సర్వీస్‌తో ఆధార్ కార్డు హార్డ్ కాపీ అందుబాటులో లేనప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో సులభంగా ఆధార్ కార్డును పొందవచ్చు. ఇది ఒక సురక్షితమైన, వేగవంతమైన పద్ధతి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మీ వ్యక్తిగత సమాచారం గోప్యతను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే సేవలను పొందండి.

Also Read :  ప్రాసెసర్ అరాచకం.. 165Hz రిఫ్రెష్ రేట్, 7,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ మొబైల్ రెడీ..!

Advertisment
తాజా కథనాలు