OnePlus 15: ప్రాసెసర్ అరాచకం.. 165Hz రిఫ్రెష్ రేట్, 7,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ మొబైల్ రెడీ..!

oneplus 15 త్వరలో విడుదల కానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రానుంది. ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండనున్నట్లు కంపెనీ టీజర్ల ద్వారా ధృవీకరించింది. గేమింగ్‌కు అనుగుణంగా దీని డిజైన్‌లో మార్పులు చేశారు.

New Update
oneplus 15 launch soon

oneplus 15 launch soon

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ OnePlus మార్కెట్‌లో దుమ్ములేపుతోంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. OnePlus తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15 ను త్వరలో చైనాలో విడుదల చేయనుంది. Weiboలో ఈ మొబైల్ టీజర్‌ను షేర్ చేసింది. ఈ కొత్త OnePlus 15 స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వస్తుంది. Android 16-ఆధారిత ColorOS 16 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై నడుస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది గతంలో OnePlus ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కంటే అతిపెద్ద అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. OnePlus 15 ఫోన్ 7,000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 

oneplus 15 launch soon

ఇటీవల హవాయిలో జరిగిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో ఆవిష్కరించబడిన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్.. ఇప్పుడు OnePlus 15 కి శక్తినిస్తుంది. కొత్త జెన్ 5 చిప్‌సెట్‌లో 4.6GHz వద్ద క్లాక్ చేయబడిన రెండు ప్రైమ్ కోర్లు, 3.62GHz వద్ద క్లాక్ చేయబడిన ఆరు పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి. OnePlus 15 మొబైల్ 165Hz రిఫ్రెష్ రేట్ LTPO OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే హై-ఫ్రేమ్ రేట్ గేమింగ్‌కు (165fps వరకు) మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

ఇటీవల లీక్‌ల ప్రకారం.. OnePlus 15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సూచిస్తున్నాయి. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP సెకండరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. OnePlus 15 ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఛార్జింగ్ కోసం కంపెనీ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఫోన్‌ను నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. 

OnePlus 15 సెప్టెంబర్ 26న జరిగే OnePlus గేమింగ్ కాన్ఫరెన్స్ (చైనా)లో దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో చైనాలో విడుదల కానుంది. అయితే OnePlus 15 ప్రపంచవ్యాప్త లాంచ్ 2026 ప్రారంభంలో జరగే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు