/rtv/media/media_files/2025/09/25/amazon-offers-2025-09-25-21-09-03.jpg)
Amazon Offers
Amazon Great Indian Festival Saleలో ఆఫర్లు దుమ్ము దులిపేస్తున్నాయి. వివిధ రకాల ప్రొడెక్టులపై అమెజాన్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, సహా ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. దీని వలన సేల్ సమయంలో ఏ ఏ ప్రొడెక్టులు అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయో గుర్తించడం చాలా మందికి కష్టమవుతుంది. అందువల్ల ఇక్కడ కొన్ని ప్రొడెక్టుల లిస్ట్ అందుబాటులో ఉంది. దీని ఆధారంగా తక్కువ ధరలో లభించే బెస్ట్ ఆఫర్ ప్రొడెక్టుల గురించి తెలుసుకుందాం.
iPhone 15
iPhone 15 లోని 128GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ బెస్ట్ సెల్లర్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2023లో ప్రారంభించింది. ఆ సమయంలో దీని అసలు ధర రూ.69,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు సేల్ సమయంలో దీనిని కేవలం రూ. 47,999కి కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy S24 Ultra
భారీ డిస్కౌంట్ పొందిన మరొక స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S24 Ultra. ఇది కూడా అమెజాన్ బెస్ట్ సెల్లర్ జాబితాలో ఉంది. దీని 256జీబీ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.1,34,999కి రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు అమెజాన్ సేల్‌లో కేవలం రూ.72,999లకి సొంతం చేసుకోవచ్చు. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
Sony Bravia 2M2 (43-inch)
దీంతోపాటు Sony Bravia 2M2 (43-inch) స్మార్ట్‌టీవీపై కూడా భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. లాంచ్ సమయంలో దీని అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ సేల్‌లో రూ.36,990కి సొంతం చేసుకోవచ్చు. దీనిపై కూడా పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. వీటితో మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.
LG UA82 Series (43-inch)
LG UA82 Series (43-inch) టీవీపై కూడా ఆఫర్లున్నాయి. దీని అసలు ధర రూ.46,090 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.26,490లకే కొనుక్కోవచ్చు.
Samsung 25W Type-C Adaptor
Samsung 25W Type-C Adaptor కూడా భారీ తగ్గింపును పొందింది. దీని అసలు ధర రూ.1699 ఉండగా.. రూ.799లకే కొనుక్కోవచ్చు.
Xiaomi Power Bank (20,000mAh)
Xiaomi Power Bank (20,000mAh) పై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. 20,000mAh పవర్ బ్యాంక్ అసలు ధర రూ.3,999 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ సేల్‌లో కేవలం రూ.1799లకే సొంతం చేసుకోవచ్చు.