12GB RAM Smartphones: టాప్ 12GB RAM స్మార్ట్‌ఫోన్స్.. ధర కూడా తక్కువేనోయ్!

12 ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. Motorola Edge 60 Pro, Poco F7 5G, iQOO Neo 10, Realme P3 Ultra 5G, Infinix GT 30 Pro ఫోన్లు 12 ర్యామ్‌‌ను కలిగి ఉన్నాయి. ఇవన్నీ రూ.35వేల లోపే అందుబాటులో ఉన్నాయి.

New Update
best 12GB RAM Smartphones

best 12GB RAM Smartphones

చాలా మంది బడ్జెట్ ధరలో హై క్లాస్ ర్యామ్ కలిగిన ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. ఎందుకంటే కొన్ని ఫోన్లు తక్కువ యాప్స్‌ వల్ల ఫుల్‌గా హ్యాంగ్ అవుతాయి. అందువల్ల ఎక్కువ రేంజ్ ర్యామ్ కలిగిన ఫోన్లు హ్యాంగింగ్ కాకుండా ఉంటాయి. మరి అలాంటి ఫోన్‌ను మీరు కూడా చూస్తున్నట్లయితే.. మీకో గుడ్ న్యూస్. ఇక్కడ అందుబాటులో కొన్ని 12 జీబీ ర్యామ్ ఫోన్లు ఉన్నాయి. అందులో Motorola Edge 60 Pro, Poco F7 5G, iQOO Neo 10, Realme P3 Ultra 5G, Infinix GT 30 Pro వంటి బ్రాండెడ్ ఫోన్లు 12GB RAMని అందిస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

12GB RAM స్మార్ట్‌ఫోన్‌లు

Poco F7 5G

Poco F7 5G ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. ఇది 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Android 15 ఆధారంగా Xiaomi HyperOS 2.0పై పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 

iQOO Neo 10

iQOO Neo 10 ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఇది 10 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

Motorola Edge 60 Pro

 Motorola Edge 60 Proలోని 12GB+256GB వేరియంట్ ధర రూ. 33,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 6000mAh బ్యాటరీ ఉంది.

Realme P3 Ultra 5G

Realme P3 Ultra 5Gలోని 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. ఇందులో 6.83-అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2800 x 1272 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా కోర్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మే UI 6.0పై పనిచేస్తుంది. 6000mAh బ్యాటరీ అందించారు. 

Infinix GT 30 Pro

ఇన్ఫినిక్స్ GT 30 Proలోని 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో నడుస్తుంది. 45W వైర్డు, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు