Lokesh: ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచండి.. జగన్ కు లోకేష్ లేఖ సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ నేత లోకేష్. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి 44 ఏండ్లకు పెంచాలని లేఖలో కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కలిపించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. By V.J Reddy 14 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP Lokesh : గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలంటూ సీఎం జగన్ కు(CM Jagan) లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh). వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితిని 44ఏళ్లకు పొడిగించాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేష్ హితవు పలికారు. 2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ (Job Notification) విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవుతూ రావటం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP Party) నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని ధ్వజమెత్తారు. గుడ్డిగా అసత్య వాగ్ధానాలు నమ్మి విశ్వసించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక కోలుకోలేని దెబ్బకొట్టారని మండిపడ్డారు. ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు! గత నాలుగన్నరేళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ (Job Calender) లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు అని లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున అకస్మాత్తుగా నిద్ర మేల్కొని వైసీపీ పాలకులు గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారని విమర్శించారు. ALSO READ: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్-1 (Group-1), గ్రూప్-2 (Group-2) ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎంతో మంది నిరుద్యోగ యువత అశలపై నీళ్లుచల్లుతోందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ల దరఖాస్తుకు ఎంతో మంది నిరుద్యోగ యువత అనర్హులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. వయో పరిమితి నిబంధన కారణంగా దరఖాస్తు చేసుకోలేని యువతకు సడలింపు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో గరిష్ట వయోపరిమితిని కనీసం 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యువతకు మీరు చేసిన మోసానికి పరిహారంగా అయినా వయోపరిమితి పెంచాలని అన్నారు. #lokesh #cm-jagan #job-calender #andhra-padesh-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి