Telangana : అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : సీఎం రేవంత్
తెలంగాణలో జులై 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరించి, జూన్ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని..డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు.