AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని అందులో ఆయన ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం లేదని అన్నారు.

AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
New Update

Chandrababu Naidu Files Complaint With CEC  : ఆంధ్ర రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ (TDP)నేత చంద్రబాబు (Chandrababu)ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని లేఖ రాశారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని ఆరోపించారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని చంద్రబాబు కోరారు. కానీ ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తించబడుతూనే ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. వాస్తవానికి ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగించాలని కానీ దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయని బాబు అన్నారు.

Also Read:కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..మరి కాసేపట్లో ఢిల్లీకి ప్రయాణం

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అర్హత లేని వారికి సైతం ఫామ్ –6 ద్వారా ఆన్‌లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై మా అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదని చంద్రబాబు ఆరోపించారు. డైరెక్ట్‌ గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 ధరఖాస్తులను స్వీకరించరాదు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు. నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సంధర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైనల్ లిస్ట్లో ఓట్ల అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ చంద్రబాబు రాష్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం కల్లా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

#andhra-pradesh #tdp #chandrababu #letter #state-election-commission
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe