Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్‌ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఫరూఖ్‌ నగర్‌ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్‌ నగర్‌ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్‌ కండక్టర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫరూఖ్‌ నగర్‌ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్‌ నగర్‌ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

అనంతరం ఆ యువతి ప్రయాణ సమయంలో ఒక కండక్టర్‌ తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఎక్స్ ( ట్విట్టర్ )లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కండక్టర్‌ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం సీఐ వెంకన్న మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, కండక్టర్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Also read: పేరు మార్చుకున్నా ముద్రగడ..ముద్రగడే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు