YSRCP: 7వ జాబితా ప్రకటించిన వైసీపీ..!!
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్కు భయం అని అన్నారు.
పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. అలా చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు వైసీపీనుంచి ఎవరూ ముందుకు రావట్లేదని విమర్శలు చేశారు.
రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారన్నారు. షర్మిల నాలెడ్జ్ లేకుండా తనపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు రాజకీయ పరిణితి లేదని కామెంట్స్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.1000 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుండి 2019 వరకు వైసీపీ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయానికి కృషి చేసిన ఆది యూత్ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.