Taneti Vanitha: వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత సంచలన కామెంట్స్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారన్నారు. షర్మిల నాలెడ్జ్ లేకుండా తనపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు రాజకీయ పరిణితి లేదని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Home Minister Taneti Vanitha: రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఆడపడుచులకు ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హోంమంత్రి తానేటి వనిత, మంత్రి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళనైనా తనకు హోంమంత్రి స్థానం ఇచ్చి సామాజిక సాధికారత కూడా చూపించారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) వెళుతుంటే ప్రతిపక్షాలు పొత్తుల కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ గా ఎదుర్కొనే ధైర్యం లేక శత్రువులందరూ ఒక్కటై జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. Also Read: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి.. ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి (Telangana) కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ను తిట్టారని.. అయితే, అవన్నీ వదిలి ఇప్పుడు కాంగ్రెస్ (Congress) లో చేరిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆమెను నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచి ఏపీకి వచ్చారని కామెంట్స్ చేశారు. ఏపీలో వెంటిలేటర్ పై ప్రాణం పోతున్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవిని తీసుకున్నారని చెప్పుకొచ్చారు. Also Read: కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..! కాంగ్రెస్ పార్టీ, టీడీపీ (TDP) పార్టీ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో అందరికీ తెలుసన్నారు. అటువంటి పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల రావడం.. ఆమెకు రాజకీయ పరిణితి లేదని అర్థం అవుతుందన్నారు. తాను రాజీనామా చేయటానికి ఎప్పుడైనా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. పదవిని పట్టుకుని వేలాడటం కోసం తాము రాలేదని చెప్పుకొచ్చారు. వచ్చాము కదా అని షర్మిల ఏదో ఆరోపణలు చేసేస్తే సరిపోదన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ టిక్కెట్లు మార్పుపై గతంలో చంద్రబాబు మార్చలేదా దాన్ని ఏమంటారు అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్న తరువాత ఎవరి ఇష్టం వారిదన్నారు. మా జగనన్న ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. #ycp #congress #cm-jagan #ys-sharmila #taneti-vanitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి