Balineni Srinivasa Reddy: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసినా.. చేయకపోయినా.. 28 వేల మందికి పట్టాలు పంపిణీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. అర్హులకు భూమి పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తనను రాజకీయంగా ఎదురుకోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Balineni Srinivasa Reddy: రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని అన్నారు. అలా చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: