AP: వాలంటీర్లకు ఆ అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం!
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ అలవెన్స్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం తమ పేపర్ సర్క్యూలేషన్ ను పెంచుకోవడానికే ఇలా అలవెన్స్ లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
AP: జగన్కు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానన్నారు యనమల రామకృష్ణుడు. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని.. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో భాగస్వామ్యులను బెదిరించి మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో థియేటర్ భాగస్వామి యువసేన.. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం అంటూ ఫ్లెక్సీలు పెట్టాడు.
ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందంటూ బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని, దీనిపై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు.
బీజేపీ హైకమాండ్ తో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓకే అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పా.. అందరూ చేరేందుకు సిద్ధమన్నారు. అయితే.. తమ పార్టీ వారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.
మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా పార్టీ నాయకులతో జగన్ వరుస భేటీలను నిర్వహిస్తూ వస్తోన్నారు.