AP News: సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు అలీ మాట్లాడుతూ.. బాలనటుడిగా రాణించిన తర్వాత.. నా సెకండ్ ఇన్నింగ్స్‌కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టాను. రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినట్లు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే టీడీపీలో చేరాను. 20 ఏళ్లు టీడీపీలో కొనసాగి.. తర్వాత వైసీపీలో చేరాను. నాకు అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమ. 45 ఏళ్లుగా 6 భాషల్లో 1200 పైచిలుకు సినిమాల్లో నటించాను. నాకు సాయం చేసే గుణం ఉంది. దానికి రాజకీయ బలం తోడైతే.. మరింత సేవే చేయవచ్చనే ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చాను. నేను ఉన్న పార్టీల్లో నాయకులను పొగిడాను తప్పితే.. ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులను ఎప్పుడూ తిట్టలేదు. ఇకపై రాజకీయాలకు మొత్తం దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చాడు.
పూర్తిగా చదవండి..Actor Ali: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆలీ.. సంచలన వీడియో విడుదల!
సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ.
Translate this News: