Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు!
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అయ్యింది.