Chandrababu: తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్.. సీఎం సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. 'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారన్నారు.

author-image
By srinivas
New Update
jgn

Tirupati Laddu : తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్ కలిపారంటూ ఏసీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారని అన్నారు. ఈ విషయం తెలియగానే తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అయితే ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన భోజనం, ప్రసాదం అందించడమే తమ లక్ష్యమన్నారు.

నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్..

'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నాం' అని సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే.. వరదల కారణంగా రూ. 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని తెలిపారు. ఇదొక చరిత్రగా పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకుంటే ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని ఈ సందర్భంగా కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు