మా డబ్బులతో జగన్.. పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలనం!

మా డబ్బులతోనే గెలిచాం అయినా పార్టీ కోసం జగన్‌తో నడిచాం. జీవితాంతం గుండెల్లో ఉంటారని చెప్పారు. నమ్మించి మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
BALINENI

నిన్న వైసీపీకి రాజనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి కొంత సేపటి క్రితం జనసేన అధినేత పవ్ కల్యాణ్‌ను కలిశారు. దాని తరువాత తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.  ఒంగోలులో సభ ఏర్పాటు చేసి అక్కడ జనసేన కండువా కప్పుకుంటానని బాలినేని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా తనతో పాటే జనసేన లోకి వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ గురించి, పార్టీ అధినేత జగన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని. 

వైయస్ తో కలిసి కాంగ్రెస్ లో నడిచాను. నా మీద నమ్మకం తో నాకు వైయస్ రాజకీయ భిక్ష పెట్టారు. అదే అభిమానంతో ఆరోజు జగన్ తో కలిసి నడిచాం.. నేను, 17మంది కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యాం. జగన్ ఎదగాలని మేము ఉప ఎన్నికలలో  గెలిచి ప్రతిపక్షం లో ఉన్నాము. మా డబ్బులతో గెలిచి జగన్ నో నడిచాం. జీవితాంతం నా గుండెల్లో ఉంటారని జగన్ చెప్పారు.  ఈ 17 మందిని వదలకుండా అండగా ఉంటాం అన్నారు. విశ్వసనీయత అని పదే పదే చెప్పే జగన్ ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రి ని చేశావా అంటూ జగన్ మీద కారాలు మిరియాలు నూరారు బాలినేని. జగన్ మనస్తత్వం అందరూ తెలుసుకోవాలని చెప్పారు. వైయస్ మీద అభిమానం తో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసిపి లో కొనసాగాను అంటూ తన బాధలు చెప్పుకొచ్చారు బాలినేని. 

రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ నా గురించి మాట్లాడారు. నా పేరు ప్రస్తావించిన పవన్ పై నాకు నమ్మకం కలిగింది. వైసీపీలో అన్నాళ్ళు ఉన్నాను..ఎంత త్యాగం చేసినా జగన్ నా గురించి మాట్లాడలేదు అంటూ వాపోయారు బాలినేని. 
ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాలేదు తాను పార్టీ విచి పెట్టి బయటకురాలేదని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు.. గౌరవం ముఖ్యం. పవన్ కళ్యాణ్ కు ఇదే విషయాన్ని చెప్పి పార్టీ లోకి వస్తున్నా అన్నారు. 
నా చేరిక మీద సోషల్ మీడియా లో ఏవో ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అవేమీ నిజం కాదు, కూటమి పక్షాన అందరం క‌లిసి పని చేస్తాం అని చెప్పారు బాలినేని శ్రీనివాస రెడ్డి. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నా పని తీరు ఉంటుంది. మూడు పార్టీ లనేతలను కలుపుకుని వెళతామని అన్నారు. అడిగిన వెంటనే ఆహ్వానించినందుకు పవన్ కు ధన్యవాదాలు చెప్పారు బాలినేని. జనసేనలో ఎప్పుడు చేరేదీ త్వరలో తేదీ ఖరారు చేస్తామని తెలిపారు.

Also Read: మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

Advertisment
తాజా కథనాలు