Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు.
కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP: అంబటి రాంబాబపై టీడీపీ విమర్శలు చేసింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న ఆయన నియమానాలను పక్కకి పెట్టి పార్టీ జెండా, జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్ను షార్ట్కు పెట్టుకొని వచ్చారని ఫైర్ అయింది. అంబటిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారని పేర్కొంది.
YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.
AP: జగన్ను విమర్శిస్తూ ఎక్స్లో టీడీపీ మరో పోస్ట్ చేసింది. హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ ట్వీట్ చేసింది. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని సెటైర్లు వేసింది.
సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి వైసీపీ. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి, అందులో రాజకీయంగా బావమరిది హరికృష్ణ సహా బంధువులను వాడుకున్న మాట నిజం కాదా? అని నిలదీసింది. హరికృష్ణకి మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నది నిజం కదా? అని ప్రశ్నించింది.