Eluru: ఏలూరులో వైసీపీకి మరో ఎదురు దెబ్బ!
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని, మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.