Yashasvi Jaiswal: యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు తీవ్ర గాయం? సెలక్టర్లకు మరో తలనొప్పి!
యశస్వి జైస్వాల్ ఎడమ చీలమండకు తీవ్ర గాయం అయింది. దీంతో సోమవారం జరగనున్న రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ నుంచి అతడు తప్పుకున్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యశస్విని నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు మరొకరిని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.