Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్‌ సెంచరీ.. సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలు

ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.

New Update
jaiswal

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ తన ఆరవ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు, దీంతో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం. గవాస్కర్ అదే రికార్డును 37 మ్యాచ్‌ల్లో సాధించారు. ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్‌ తన టెస్ట్ కెరీర్‌లో ఆరవ సెంచరీని, ఇంగ్లాండ్‌పై నాలుగవ సెంచరీని పూర్తి చేశాడు.

ఇది యశస్వి జైస్వాల్‌కు కేవలం వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు, భారత క్రికెట్‌ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన ఘట్టం కూడా . ఈ సిరీస్‌లో జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు రెండు సెంచరీలు సాధించారు.   ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారత ఓపెనర్లలో జైస్వాల్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడు. 16 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలతో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు, జైస్వాల్, రోహిత్ శర్మ, గవాస్కర్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

టాప్ 5లో ఉన్నది వీళ్లే 

కేఎల్ రాహుల్ - 16 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు
యశస్వి జైస్వాల్ - 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు
రోహిత్ శర్మ - 13 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు
సునీల్ గవాస్కర్ - 37 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు
విజయ్ మర్చంట్ - 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు
మురళీ విజయ్ - 11 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు

బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆకాష్ దీప్‌

75 వికెట్ల నష్టానికి 2 వికెట్లు కోల్పోయి మూడో రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించింది టీమిండియా. యశస్వి జైస్వాల్ సెంచరీతో ఆకట్టుకోగా నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాష్ దీప్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు.  66 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. ఇద్దరూ కలిసి  మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంచ్ బ్రేక్ సమయానికి, భారత్ 189/3 స్కోరుతో ఒక పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఆ తరువాత వచ్చిన గిల్  (11), కరుణ్ నాయర్ (17) పరుగులతో నిరాశపరిచారు.  ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్ (25), రవీంద్ర జడేజా (26) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 281గా ఉంది.  

Advertisment
తాజా కథనాలు