AP: దారుణం.. ప్రేమజంటకు ఆశ్రయం కల్పించినందుకు యువకుడిపై పెట్రోలు పోసి..
పశ్చిమ గోదావరి జిల్లా మైసన్నగూడేంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. భయపడిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
AP: ఏపీలో దారుణం.. ప్రేమజంటపై దాడి..!
కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra Pradesh : పాపం.. శ్మశానవాటికకు దారి లేక..
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో శ్మశానవాటికకు వెళ్లే దారిలేకపోవడంతో ఎస్సీ కాలనీవాసులు మోకాల్లోతు నీళ్లలో మృతదేహాన్ని తరలించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకీ దుస్థితి తప్పడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశానవాటికకు రోడ్డు వేయాలని కోరుతున్నారు.
AP: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..!
ఏలూరు జిల్లా భీమడోలులో తన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పొలాసానిపల్లికు చెందిన రావికుమార్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది.
AP: దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..!
ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.
Movie Tree : నేల కూలిన సినిమా చెట్టు... ఈ చెట్టు ఉంటే.. కచ్చితంగా హిట్టు!
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది.సుమారు 300 సినిమాల్లోని సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. ప్రముఖ డైరెక్టర్లు బాపు,విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి వారు ఎన్నో సినిమాలను ఈ చెట్టుకింద తీర్చిదిద్దారు.
AP: ఘనంగా వంగవీటి మోహన రంగ విగ్రహ ఆవిష్కరణ.!
పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాపులు అంటే అల్లరి మూక అని ముద్ర పడిందని అలా కాకుండా రంగా ఆశయ సాధన కోసం బలహీన వర్గాలకు తోడుగా, అండగా నిలవాలని జిల్లాలోని కాపు ముఖ్య నాయకులు అన్నారు.
Andhra Pradesh : నన్ను రక్షించండి.. లేదంటే చచ్చిపోతాను.. మరో గల్ఫ్ బాధితురాలు.. రూంలో బంధించి..!
ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో తన పడుతున్న బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను రక్షించాలని వేడుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lovers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/love.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/ap-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kkd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/0nXOzREixNE-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/vigraham.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/girl.jpg)