మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్!

ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్‌లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.

New Update
BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్

మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు మద్యం షాప్‌లను మూసివేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు మూత పడనున్నాయి. డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో డిసెంబర్ 4, 5 వ తేదీల్లో మద్యం షాప్‌లను మూసివేయనున్నట్లు ఆ జిల్లాల కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికల కారణంగా..

ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం నుంచే మద్యం షాపులను మూసివేశారు. ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోెలింగ్ రోజున సాయంత్రం 4 గంటలకు మళ్లీ మద్యం షాపులు తెరవనున్నారు. అప్పటి వరకు మూతపడి ఉంటాయి. ఈ నెల 5వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. 9వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.  కాకినాడ జిల్లాలో 3418 మంది ఓటర్లు ఉండగా, 22 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!

డిసెంబర్ 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను కాకినాడ జేఎన్‌ టీయూలోని బీఆర్‌ అంబేడ్కర్ సెంట్రల్‌ లైబ్రరీలో స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు.

ఇది కూడా చూడండి:  YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

Advertisment