Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. సెలవులపై వెళ్ళిన ఎంపీడీఓ ఫోన్ ఏలురు కాలువలో దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా..స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి ఆస్పత్రిలో కొత్త రకం దోపిడి వెలుగులోకి వచ్చింది. కంటి చెకప్ కోసం వెళ్లిన వృద్ధురాలికి HIV పాజిటివ్ అని చెప్పి.. చికిత్స కోసం అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు. మరోచోట చెక్ చేయించగా హెచ్ఐవి నెగిటివ్ రావడంతో వీరి బాగోతం బయటపడింది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మూడు నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం- హైదరాబాదుకు రెండు స్లీపర్ బస్సులు, జంగారెడ్డిగూడెం - విజయనగరం వరకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు.
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన సాయి సూర్య అవినాశ్ (26) అనే విద్యార్థి సోమవారం ప్రమాదవశాత్తు జలపాతంలో పడి చనిపోయాడు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ రైతు వినూత్న ఆలోచన చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడు. గాడిద పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రూ.7 లక్షలతో ఏకంగా 40 గాడిదలు కొని ఫామ్ ఏర్పాటు చేశాడు రైతు దుర్గారావు. లీటర్ గాడిద పాలు రూ.2 వేలకు పైబడి అమ్ముతూ లక్షాధికారి అయ్యాడు.
తణుకు మండలం దువ్వ గ్రామంలోఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్యం తాగిన మత్తులో గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ భాస్కరరావు మీద గాజు పెంకుతో దాడి చేసి హత్య చేశాడు.