AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.

New Update
Hyderabad Gun Fire News

Hyderabad Gun Fire News

Ap Breaking: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. 

Also Read:America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: BIG BREAKING: తెలంగాణలో షాకింగ్ కొత్త వైరస్.. సిద్దిపేటలో తొలి కేసు!

వివరాల ప్రకారం..పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఏజీఎస్‌ మూర్తి శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తణుకు రూరల్‌ ఎస్సైగా  పని చేస్తున్నారు.కాగా, ఇటీవల ఏజీఎస్‌ మూర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

సర్వీస్‌ తుపాకీతో..

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పోలీసు స్టేషన్‌ కు వచ్చిన ఆయన సర్వీస్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతరం సిబ్బంది 108 వాహనంలో ఎస్సై మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also Read: USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

Also Read:   Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

గతేడాది డిసెంబర్‌ లో కూడా విజయనగరం జిల్లాకు చెందిన పాలవలస శంకరరావు (35) అనే కానిస్టేబుల్‌ కూడా ఇలాగే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శంకరరావు భార్య శ్రావణి, కుమారుడు కిశోర్‌, కుమార్తె జ్ఞానవితతో కలిసి మద్దిలపాలెం ప్రాంతంలోని పీతలవానిపాలెంలో నివాసం ఉండేవాడు. ఉద్యోగంలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఐదు గంటలకు ద్వారకా నగర్‌లో గల ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు చెస్ట్‌లో సెంట్రీ డ్యూటీకి హాజరయ్యారు. 

ఉదయం ఏడు గంటల సమయంలో తన చేతిలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి ఏసీపీ రాంబాబు, ద్వారకా స్టేషన్‌ సీఐ ఎస్‌.రమేష్‌ విచారణ చేశారు. తమ బిడ్డకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని, భార్య శ్రావణి, పిల్లలతో ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నట్టు శంకరరావు తల్లిదండ్రులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు