Tirupati stampede: తిరుపతి తొక్కిసలాట...జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం

వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జి జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిని నియమించింది. ఈ మేరకు న్యాయవిచారణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Tirupati stampede

Tirupati stampede

Tirupati stampede: వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణ మూర్తిని నియమించింది. మూర్తి ఆధ్వర్యంలో న్యాయవిచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై ఆరునెలల కాలంలో నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఇది కూడా చూడండి: ఎయిర్‌పోర్టులో మహిళా ప్రయాణికురాలు అరెస్టు.. లోదుస్తుల్లో లైటర్స్

వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలకు జనవరి 8న తిరుపతిలో టోకెన్లు ఇచ్చేందుకు కేంద్రాలను నెలకొల్పింది. పద్మావతి పార్కులో నెలకొల్పిన ఈ టోకెన్ల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో జరిగిన తొక్కిసలాటలో 6 గురు చనిపోయారు. 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో తొక్కిసలాట జరగడం, ఆరుగురు చనిపోవడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు టీటీడీ, ఇటు కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు వచ్చాయి.

ఇది కూడా చూడండి: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!

ఘటన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా స్పందించడమే కాకుండా వెంటనే  ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.
అలాగే గాయపడ్డవారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు.

ఇది కూడా చూడండి: భట్టి vs  ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!


ఈ తొక్కిసలాటలో పోలీసు, అధికారుల వైఫల్యం ఉందంటూ ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు డీఎస్పీని, గోశాల అసిస్టెంట్‌ను డైరెక్టర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. టీటీడీ పాలక మండలిపై కూడా  ముఖ్యమంత్రి చివాట్టు పెట్టారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తను స్వయంగా క్షమాపణలు కోరడంతో పాటు పాలకమండలి సైతం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Also Read: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 నోటిఫికేషన్‌ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!

జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలని హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో కానీ లేదా మాజీ న్యాయమూర్తితో గానీ విచారణ జరిపించాలని ఆ ప్రజా ప్రయోజన వాజ్యంలో స్పష్టం చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది శివప్రసాదరెడ్డి.. హైకోర్టును కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వేకేషన్ కోర్టులో వేస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.కాగా ఈ కేసు విషయమై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు ప్రమాదానికి కారణమైన ఘటనలను వెలికితీసేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 
 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు