Rave Party: రేవ్ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!
బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది విజయవాడ అని పోలీసులు గుర్తించారు. పూరింట్లో ఉంటూ తల్లితో దోసెలమ్మిన వాసు.. బుకీగా మారి కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.