Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు AP: విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో మందలించడంతో ప్రియురాలి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో మొఖంపై పొడిచి చంపేశాడు ఓ యువకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 28 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayawada Killer : విజయవాడలోని బృందావన్ కాలనీలో హత్య (Kill) కలకలం రేపింది. సింధు భవన్ వద్ద కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు (Love) సమాచారం. సదరు యువకుడిని మందలించడంతో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. షాపు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కత్తితో దాడి ఆ యువకుడు చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు (Krishna Lanka Police). కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో ఆ యువకుడు తాను వ్యాపారి కూతురు ప్రేమించుకున్నామని.. అది తెలిసి ఆ వ్యాపారి 10 మందితో కలిసి తన ఇంటికి వచ్చి బెదిరించాడని చెప్పాడు. వ్యాపారి మాటలకు తన తల్లి చనిపోయింది అంటూ ఆ వ్యాపారిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. Also Read : ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండి పడుతున్న తల్లి దండ్రులు! #lovers #vijayawada #kill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి