Rahul Gandhi : బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి.. విపక్షాల ఒత్తిడికి వెనక్కి తగ్గిన కేంద్రం
కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 45 మందిని నేరుగా నియమించే ప్రక్రియ ఆగిపోయింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ ఉద్యోగాలకు గండికొడుతున్నారని విపక్షాలు విమర్శలు చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విధానాన్ని మళ్లీ పరిశీలిస్తామని పేర్కొంది.