IAS Pooja: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్

పుణెలో ట్రైనీ ఐఏఎస్‌ గా ఉన్న పూజా ఖేద్కర్‌ కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది.

New Update
IAS Pooja: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్

IAS Pooja: పుణెలో ట్రైనీ ఐఏఎస్‌ గా ఉన్న పూజా ఖేద్కర్‌ కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది. దీంతోపాటు కమిషన్‌ ఆమె పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి యూపీఎస్పీ వివరణ ఇచ్చింది.

ఖేద్కర్ అన్ని సర్టిఫికేట్లు, ఇతర పత్రాలను కోరుతూ యూపీఎస్సీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పూజా ఖేద్కర్‌ ఎఫ్‌ఐఆర్‌పై యూపీఎస్సీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పూజా ఖేద్కర్ 2022లో సివిల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ విచారణ చేపట్టింది.

పరీక్షలో ఇచ్చిన సడలింపును ఆమె తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేరు, ఫొటో, ఈమెయిల్ ఐడీ, సంతకం, మొబైల్ నంబర్, చిరునామా మార్చుకుని తన గుర్తింపును దాచేందుకు పూజా ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.

ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు రూపొందించిన నిబంధనల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. సీఎస్‌ఈ 2022లో ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏదైనా పోటీ పరీక్షకు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హురాలనియూపీఎస్సీ ప్రకటించింది.

Also read: గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు… పొంగిపొర్లుతున్న జలాశయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు