Ukraine: భారత్‌లో జెలెన్స్కీ పర్యటన..
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్స్కీ ఇక్కడకు రానున్నారు.
Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే!
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.
Ukraine: క్షిపణులతో రష్యా మళ్ళీ దాడి..సాయం చేయమంటున్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.
PM Modi : 45 ఏళ్ళలో మొదటిసారి పోలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత్–పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ దేశంలో పర్యటిస్తున్నారు.
Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్ సరిహద్దుల్లో హై అలెర్ట్..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే కర్స్క్ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్ సేనలు మరింత ముందుకు సాగుతున్నాయి. దీంతో బెల్గొరాడ్‌లో రష్యా ఎమర్జెన్సీ విధించింది. అలాగే రష్యన్ అధికారులు పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Russia : పుతిన్ కి ఎదురుదెబ్బ.. రష్యా భూభాగం ఉక్రెయిన్ చేతుల్లోకి!
రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం...అక్కడి ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. కస్క్ రీజియన్ లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న రష్యా భూభాగం తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కో పేర్కొన్నారు.
ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్న మోదీ!
ప్రధాని మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. గత నెలలో జరిగిన జీ7 సదస్సులో జెలెన్ స్కీని మోదీ కలిశారు. శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన శక్తి మేరకు ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. గత రష్యా పర్యటనలో కూడా యుద్ధం పరిష్కారం కాదని పుతిన్ కి మోదీ తెలియజేశారు.
Russia: రష్యా సరిహద్దులో అమెరికా బాంబర్ విమానాలు.. ఉక్రెయిన్ కోసమేనంటూ!
అమెరికా బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్లు రష్యా ఆరోపించింది. అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని పేర్కొంది. వాటిని ఫైటర్ జెట్లతో అడ్డుకున్నట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది.
/rtv/media/media_files/2024/11/17/4MKZZ84FVNmJR3fkdvjw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/us-president-joe-biden-meeting-with-pm-narendra-modi-america-visit-on-june-22-on-various-issues-between-two-countries.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T203614.620.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Putin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T154943.853.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-37-6.jpg)