TG Crime: వరంగల్లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ దుర్మరణం
వరంగల్ జిల్లా మట్టెవాడలో వాహనం ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్రాజు మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.