TG Crime: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మట్టెవాడలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వాహనంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కానిస్టేబుల్ని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమించటంతో అతడు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజుగా గుర్తించారు.
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి:
ఇది కూడా చదవండి: రోజూ ఈ సమయంలో యాపిల్ తింటే ఎన్నో లాభాలు
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విధులకై పోలీస్ కమిషనరేట్‌కి బైక్‌పై వెళ్తున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్ క్రింద పడి స్పృహ కోల్పోయాడు. ప్రమాదం స్పందించిన స్థానికులు వెంటనే ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ్‌రాజు పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే సమయంలో మార్గమధ్యలోనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సంక్రాంతికి ఈ మూడు రాశుల వారికి శుభవార్త.. మకర రాశిలో సూర్యభగవానుడి సంచారం!