TG News: గద్వాల గురుకులంలో ఘోరం.. చెప్పులు లేకుండా 18 కి.మీ నడుస్తూ..!

జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించేదుకు విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. విద్యాబోధన సరిగా లేదని, చదువుకోడానికి మెటీరియల్స్ ఇవ్వడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
gurukula school

gurukula school Photograph

TG News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల సమస్యలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో రోజుకొక సమస్య వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ఘటన తెలంగాణలో కలకలం రేపుతుంది.  జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. హాస్టల్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చెప్పుల్లేకుండా తమ సమస్యను కలెక్టర్‌కే విన్నవించుకోవాలని బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంసంగా మారింది.

విద్యాబోధన సరిగా లేదని..

ఈ మధ్యకాలంలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్, స్కూల్‌లలో విద్యార్థులపై ఉపాధ్యాయులు వేధింపులు, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, ఇలా రకరకాల సమస్యలు గురుకుల పాఠశాల విద్యార్థులు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బీచుపల్లి ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కలెక్టర్ సంతోష్‌ను కలిసి సమస్యను వివరించారని నిర్ణయించుకున్నారు. గురుకుల పాఠశాలలో విద్యాబోధన సరిగా లేదని, చదువుకోడానికి మెటీరియల్స్ కూడా ఇవ్వడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాస్టల్లో మరుగుదొడ్లు కూడా సరిపడలేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. భోజన విషయంలో మెనూ ప్రకారం పెట్టకుండా ప్రిన్సిపల్ క్రమశిక్షణ అంటూ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు మొరపెట్టుకున్నారు. ఆరో తరగతిలో మిగిలిపోయిన సీట్లు కూడా ప్రిన్సిపల్ అమ్ముకుంటున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

 

విద్యార్థులు పాదయాత్ర చేస్తుండడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్పందించారు. విద్యార్థులను వారించే ప్రయత్నం చేసినా విద్యార్థులు వెనక్కి తగ్గకుండా పాదయాత్రలను కొనసాగించారు. సుమారు 200 మంది విద్యార్థులు చెప్పులు లేకుండా ర్యాలీ చేయడంపైన పోలీసుల సైతం బందోబస్తుగా వెళ్లారు. వీరాపురం స్టేజి దగ్గర ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి విద్యార్థులను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేశారు. విద్యార్థులు నిరసన ర్యాలీ గురించి సమాచారం ఇచ్చారు. అయితే విద్యార్థులు పాదయాత్రగా వెళ్తున్నా కలెక్టర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు. కనీసం పాఠశాలకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ చెప్పకపోవడంతో ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. 

సమస్యపై టీచర్లని వివరణ కోరగా.. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటైపోతున్నారని.. వాళ్ళ భవిష్యత్త్ సక్రమంగా ఉంచేందుకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చామని చెబుతున్నారు. టీచర్ల అనుమతి లేకుండా బయట తిరుగుతున్నారని.. అందుకే హెచ్చరించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇలా చెడు అలవాట్లకు అలవాటైన విద్యార్థికి టీసీ ఇచ్చి పంపినట్లు, విద్యార్థుల భవిష్యత్త్ కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెబుతున్నారు

ఇది కూడా చదవవండి: చలికాలంలో రోజూ 2 గుడ్లు తింటే ఈ వ్యాధులు మాయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు