Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలో ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిప్రమాదాన్ని గమనించిన పోలీసులు కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజిన్లతో మంటలు అదుపు చేసే ప్రయత్నిస్తున్నారు.
సోఫా, తలుపుల పరిశ్రమంలో..
ఇది కూడా చదవండి: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!
మంటలతోపాటు నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. మంటలను చూసి పరిశ్రమలోని కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సోఫా, తలుపులను తయారు చేసే పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
HYDERABAD MADANAPET FIRE
— Shakeel Yasar Ullah (@yasarullah) December 19, 2024
A fire incident occurred in the Fabrication welding shop opposite Madanapet Eidgah Is sadan police station limits, Five fire tenders were rushed to the spot and doused the fire. pic.twitter.com/6virWCt2Ax
పెద్ద మంటలకు వస్తువులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే అల్లం