హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృత్యువాత

హైదరాబాద్‌లోని మాదాపూర్ పీఎస్‌ పరిధిలో బైక్ అతివేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి చెందారు.

New Update
Two techies died

Two techies died Photograph

TG Crime: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. బైక్ అతివేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి చెందారు.

అతి వేగంతో...

 

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా.. ఈ దారుణం జరిగింది.  ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా..  మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో  ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  రాత్రిపూట పొరపాటున కూడా ఈ పండ్లు తినకండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు